Sunday, December 16, 2007

మూసివేత దిశగా "వార్త" శ్రీకాకుళం ఎడిషన్?

కొత్తగావస్తున్న పత్రికల దాటికో లేక కొనసాగించలేకో తెలియదు కానీ శ్రీకాకుళం "వార్త" యూనిట్ను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. "సాక్షి" ప్రకటన వెలువడిన నాటినుంచే మూసివేత ప్రచారం జరుగుతున్నా, ఇన్నాళ్లూ దీని గురించి పెద్దగా పట్టించుకోని సిబ్బంది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. 75 ఏళ్ల వయో వృద్ధుని (బ్రాంచ్ మేనేజర్)కి యూనిట్ బాధ్యతలు అప్పగించడాన్ని బట్టి మూసివేత నిర్ణయానికి మరింత బలం చేకూరినట్లయింది.యూనిట్ మూసివేతకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే అంటుండడాన్ని బట్టి యూనిట్ పెద్దలపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బి.ఎం., స్టాఫ్ రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, మరికొంత మంది మండల విలేఖరులపై ఉన్న వ్యతిరేకతకు ఏకంగా యూనిట్ బలికావాల్సిందేనా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నా పట్టించుకునేవాడేడీ?వీళ్లే కలెక్షన్ కింగులు!బి.ఎం., స్టాఫ్ రిపోర్ట్రర్, ఫొటోగ్రాఫర్, కంట్రీబ్యూటర్లు: శ్రీకాకుళం టౌన్, టెక్కలి, నరసన్నపేట, మందస, ఆమదాలవలస, వీరఘట్టం, పాలకొండ, రాజాం, ఇచ్ఛాపురం, గార. వీళ్లంతా స్టాఫ్ రిపోర్టర్ పేరుచెప్పి భారీగా వసూళ్లు చేస్తున్న విషయమై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

No comments: