Sunday, December 16, 2007

బ్లాక్ మెయిల్లోనూ "ఒకే ఒక్కడు"!

విశాఖ జర్నలిస్టులకే కాకుండా మొత్తం ఉత్తరాంధ్రాకే పెద్ద వెదవలా తయారై ఇటు జర్నలిస్టులను, అటు ప్రభుత్వ అధికారులనూ బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వీరాభిమన్యుడిపై ప్రత్యేక కథనం వచ్చే అప్డేట్లో... "ఒకే ఒక్కడి"గా పేరొందిన ఈ వెదవ గొడవలకి విశాఖ పాత్రికేయ లోకం ముక్కున వేలేసుకుంటోంది.

విజయవాడలో రౌడీ జర్నలిస్టులు!

విజయవాడ: ఈ నగరం రౌడీలకు నిలయమనేది మనవాళ్లందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు విలేఖర్లు కూడా రౌడీలుగా ప్రవర్తిస్తూ మండల విలేఖరులను దోచుకుంటున్న వైనమిది. వీళ్లిద్దరూ పేరుకే పెద్ద పత్రికల స్టాఫ్ రిపోర్టర్లు కానీ, ప్రవర్తన తీరు మాత్రం వీధి రౌడీలను తలపిస్తోంది. వీళ్ల దౌర్జన్యాలపై ప్రత్యేక కథనాలు వచ్చే అప్ డేట్లో...!

వి.జె.ఎఫ్. నిధుల గోల్ మాల్!

విశాఖపట్నం: జర్నలిస్టుల సంక్షేమం పేరిట ఏర్పాటైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం (వి.జె.ఎఫ్.) క్రమేణా తన లక్ష్యానికి భిన్నంగా పనిచేస్తోంది. తన బాధ్యతలను ట్రేడ్ యూనియన్లు హైజాక్ చేసుకుపోతుంటే మిన్నకుండిపోవడమే కాకుండా క్లబ్బుకి వస్తున్న ఆదాయాన్ని కైంకర్యం చేసే సంస్క్రుతిని పరోక్షంగా ప్రోత్సహిస్తోంది. గతంలో కమిటీలోని ఒకరిద్దరు మాత్రమే అక్రమార్జనకు పాల్పడితే ఇప్పుడు ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా అందిన కాడికి నొల్లుకుంటున్నారట! ఇందులో ఏమాత్రం నిజముందో వచ్చేవారం వరకు ఆగాల్సిందే!! సభ్యులను నిలువునా మోసం చేస్తున్న వి.జె.ఎఫ్. పాలకుల బండారాన్ని బట్టబయలు చేయడంలో ముఖ్యోద్దేశం మీకు తెలిసిందే.

జర్నలిస్టుల భూ వ్యాపారం!

రియల్ ఎస్టేట్ భూం ఎందరో జీరోలని హీరోలను చేసినట్టే, విశాఖలో కొంతమంది జర్నలిస్టులను కూడా చేసింది. వాళ్లు ఎంత కూడవెట్టారోనని నోళ్లు వెళ్లవెట్టడం కంటే, మనమూ వీళ్లని ఆదర్శంగా తీసుకుని ఫీల్డుకి దూరంగా ఉంటూ ఆర్జిద్దాం!రామాంజనేయులు (ఈనాడు)సురేష్ కుమార్ (ఈనాడు)రాజేష్ కుమార్ (ఈనాడు)నాగేశ్వర రావు (ఈనాడు)పి.నారాయణరావు (విశాఖ సమాచారం)ఆర్.వి.కృష్ణారావు (ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి)ఆర్.వి.బాబూరావు (కేబుల్ విజన్)బి.రవికుమార్ (స్టేట్ టైమ్స్)ఎస్.ఎస్.శివశంకర్ (విజన్, తేజ టీవీ)కె.ఎం.పి.పట్నాయక్ (డెక్కన్ క్రానికల్)ఎం.కృష్ణారావు (ఆంధ్రావాయిస్)ఎస్.దుర్గారావు (విజన్)ఎ.మురళీకృష్ణ (విజన్)ఎన్.బాపూరావు (గ్రేటర్ న్యూస్)ఎం.కన్నఅప్పారావు (దిశ)సన్నిధానం శాస్త్రి (ఆంధ్రభూమి)జర్నలిస్టులుగా మారిన రియల్టర్లు!జి.గిరిబాబు (ఆంధ్రావాయిస్)మళ్ల విజయప్రసాద్ (విజన్)వీళ్లలో నిశితంగా పరిశీలిస్తే చాలా మంది ఫీల్డులో లేరనిపిస్తుంది కదూ. నిజమే మరి ఎక్కడ ఆదాయం బగుంటే అక్కడుండేవాడే నిజమైన ఎ(జ)ర్నలిస్టు! అదేంటీ కొద్దిమంది పేర్లే రాసి మిగిలిన వాళ్ల పేర్లు వదిలేశారేంటీ అని అనుకోవద్దు. అందరి పేర్లూ ఒకేసారి ఇచ్చేస్తే థ్రిల్లేముంటుంది. సీరియల్గా ఇద్దామనే ప్రయత్నం. మీకు తెలిసిన సమాచారం కూడా జోడిస్తే సంపూర్ణంగా ఉంటుంది.

మూసివేత దిశగా "వార్త" శ్రీకాకుళం ఎడిషన్?

కొత్తగావస్తున్న పత్రికల దాటికో లేక కొనసాగించలేకో తెలియదు కానీ శ్రీకాకుళం "వార్త" యూనిట్ను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. "సాక్షి" ప్రకటన వెలువడిన నాటినుంచే మూసివేత ప్రచారం జరుగుతున్నా, ఇన్నాళ్లూ దీని గురించి పెద్దగా పట్టించుకోని సిబ్బంది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. 75 ఏళ్ల వయో వృద్ధుని (బ్రాంచ్ మేనేజర్)కి యూనిట్ బాధ్యతలు అప్పగించడాన్ని బట్టి మూసివేత నిర్ణయానికి మరింత బలం చేకూరినట్లయింది.యూనిట్ మూసివేతకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుబట్టాల్సిన అవసరం లేదని అందులో పనిచేస్తున్న సిబ్బందే అంటుండడాన్ని బట్టి యూనిట్ పెద్దలపై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బి.ఎం., స్టాఫ్ రిపోర్టర్, ఫొటోగ్రాఫర్, మరికొంత మంది మండల విలేఖరులపై ఉన్న వ్యతిరేకతకు ఏకంగా యూనిట్ బలికావాల్సిందేనా? అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నా పట్టించుకునేవాడేడీ?వీళ్లే కలెక్షన్ కింగులు!బి.ఎం., స్టాఫ్ రిపోర్ట్రర్, ఫొటోగ్రాఫర్, కంట్రీబ్యూటర్లు: శ్రీకాకుళం టౌన్, టెక్కలి, నరసన్నపేట, మందస, ఆమదాలవలస, వీరఘట్టం, పాలకొండ, రాజాం, ఇచ్ఛాపురం, గార. వీళ్లంతా స్టాఫ్ రిపోర్టర్ పేరుచెప్పి భారీగా వసూళ్లు చేస్తున్న విషయమై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

విశాఖ డి.ఆర్.ఒ. చేతిలో కీలుబొమ్మలీ విలేఖరులు!

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఎందుకంటే, వీళ్లకీ డిఆర్వోకీ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి మరి. కలెక్టరేట్లో ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు.డిఆర్వో చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.

విలేఖరుల పొట్టలు కొడుతున్న వామపక్షాల పత్రికలు