Sunday, December 16, 2007

విజయభాను ఎడిటర్ పై విశాఖ సమాచారం మనుషుల దాడి

(విశాఖ నుంచి ప్రకాష్)
విశాఖ కేంద్రంగా ప్రచురితం అవుతున్న రెండు చిన్న పత్రికల మధ్య నెలకొని ఉన్న అంతర్గత గొడవలు ఒక్కసారిగా పురివిప్పి ఒక వర్గంపై దాడికి ఉసిగొల్పాయి. విజయభాను ఎడిటర్ ఇంటిపై దాడికి పాల్పడిన వారు విశాఖ సమాచారమ్ యాజమాన్యం పురమాయించిన వీధి రౌడీలన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తరపువాళ్లు చేయించిన దాడిని నారాయణరావు పట్నాయక్ విజయభాను వాళ్లు చేయించిన దాడిగా బయటి ప్రపంచాని నమ్మించవచ్చేమో గానీ, తోటి పాత్రికేయ సమాజాన్ని మాత్రం నమ్మించడం చాలా కష్టం! పరాయి ఆడదానితో సంబంధాలు పెట్టుకునే ప్రతి వెధవకూ నారాయణరావుకి జరిగిన శాస్తే జరుగుతుందనడానికి చెప్పడానికి ఒక మచ్చుతునకగా మాత్రమే ఈ సంఘటనను చూడాలి తప్ప రెండు పత్రికల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసే ప్రయత్నాలు చెయ్యకూడదు. విశాఖలోని కొంతమంది పెద్ద ఎ(జ)ర్నలిస్టులు మాత్రం దాన్ని విజయభాను యాజమాన్యం చేయించిన దాడిగానే ప్రచారం చించడం ఖోసం సే ప్రయత్నం చేస్తున్నరు. దీన్నే మేం ఖండిస్తున్నాం. నారాయణరావు చేసిన తప్పు ఎంతమంది చేయడంలేదని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఇలా తప్పు చేసిన ప్రతివాడికీ మనవాళ్లు సపోర్టు చేస్తున్నారా? ఆలోచించండి. నారాయణరావుపై జరిగిన దాడి వ్యక్తిగతమైంది కాదని జనాన్నీ, ప్రత్యేకించి ఇంట్లోవాళ్లనీ నమ్మించడం కోసం కడకు విజయభాను ఎం.డి. ఇంటిపై దాడికి ఒడిగట్టిన వైనం అందరికీ తెలిసిందే. ఇలాంటి తెలివితేటలు ఎదగడికి చూపించాలే కానీ ఒకర్ని దెబ్బతీయడానికి కాదని నారాయణరావు, అతన్ని వెనకేసుకు వస్తున్న ఎర్నలిస్టులూ గ్రహిస్తే మంచిది. వెధవలకు మధ్దతుగా ధర్నాలూ, ఆందోళనలూ చేసి మనపరువు మనం తీసుకోవద్దు.

No comments: